శనివారం 06 జూన్ 2020
National - May 22, 2020 , 14:55:37

ఎయిరిండియాలో డొమెస్టిక్‌ ఫ్లైట్‌ బుకింగ్స్‌ ప్రారంభం

ఎయిరిండియాలో డొమెస్టిక్‌ ఫ్లైట్‌ బుకింగ్స్‌ ప్రారంభం

న్యూఢిల్లీ: నాలుగో విడత లాక్‌డౌన్‌లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల మేరకు దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా డొమెస్టిక్‌ ఫ్లైట్‌ బుకింగ్స్‌ ప్రారంభించింది. శనివారం నుంచి డొమెస్టిక్‌ ఫ్లైట్‌ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయని ఎయిర్‌ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశీయ విమాన సర్వీసుల విషయంలో కేంద్రం ఇచ్చిన మినహాయింపుల మేరకు మే 25 నుంచి ఆగస్టు 25 వరకు మూడు నెలలపాటు ఎయిర్‌ ఇండియా వారానికి 8,428 సర్వీసుల చొప్పున నడుపనుంది. 

కాగా, మే 25 నుంచి ప్రారంభమయ్యే డొమెస్టిక్‌ సర్వీసుల చార్జీలు కనిష్టంగా 2,000, గరిష్టంగా 18,600 పరిమితిని దాటకూడదని పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురి స్పష్టం చేశారు. దేశంలోని అన్ని ఎయిర్‌ లైన్స్‌కు ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి హర్దీప్‌ ఆదేశాలకు లోబడి ధరల నిర్ణయించిన ఎయిర్‌ ఇండియా సంస్థ శనివారం నుంచి డొమెస్టిక్‌ విమానాల బుకింగ్‌లు మొదలుపెట్టింది.


logo