వ్యాక్సిన్ వేయకుంటే పని ఆపేస్తాం : ఎయిర్ ఇండియా పైలట్ల హెచ్చరిక

న్యూఢిల్లీ : తమ సిబ్బంది అందరికీ తక్షణమే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టని పక్షంలో పనులు నిలిపివేస్తామని ఎయిర్ ఇండియా పైలట్ల సంఘం హెచ్చరించింది. సంస్థకు చెందిన 18 ఏండ్లకు పైబడిన విమాన సిబ్బందికి వ్యాక్సిన్ వేసేందుకు వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహించని పక్షంలో తాము పనిని ఆపేస్తామని భారత వాణిజ్య పైలట్ల సంఘం (ఐసీపీఏ) తేల్చిచెప్పింది. కేంద్ర పౌరవిమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ఐసీపీఏ లేఖ రాసింది. కొవిడ్-19కు ముందున్న వేతనాలను తమకు పునరుద్ధరించాలని ఈ లేఖలో మంత్రిని కోరింది.
గతంలో మంత్రి హామీ ఇచ్చినా వేతన కోతలపై ఎయిర్ ఇండియా యాజమాన్యం పైలట్ల పట్ల కటువుగా వ్యవహరిస్తోందని వాపోయింది. కరోనా మహమ్మారి సాకుతో పైలట్ల వేతనాలను ఎయిర్ ఇండియా 55 శాతం తగ్గించిందని డిసెంబర్ లో ఐదు శాతం మేరకు తిరిగి జోడించినా కరోనాకు ముందున్న వేతనాలతో పోలిస్తే పైలట్ల వేతనాలు 50 శాతం తక్కువగా ఉన్నాయని గుర్తుచేసింది. వేతన సమస్యతో పాటు తమకు కొవిడ్-19 ముప్పు అధికంగా ఉన్నందున తక్షణమే దేశవ్యాప్తంగా ఎయిర్ ఇండియా పైలట్ల కోసం వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఐసీపీఏ కోరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

