ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. వెనక్కి వచ్చేసిన ఎయిర్ ఇండియా విమానం
Air India | ఉక్రెయిన్‌లో ఉన్న భారత విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు కీవ్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం (Air India Flight) వెనక్కి వచ్చేసింది.
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించింది. దీంతో దేశంలోని విమానాశ్రయాలు, గగనతలాన్ని ఉక్రెయిన్ మూసింది. ఈ నేపథ్యంలో.. ఆ దేశంలో ఉన్న భారత విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు కీవ్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం (Air India Flight) వెనక్కి వచ్చేసింది.
గురువారం ఉదయం 7.30 గంటలకు న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయం నుంచి ‘ఏఐ 1947’ ఎయిర్ ఇండియా విమానం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు బయల్దేరింది. అయితే రష్యా యుద్ధం నేపథ్యంలో గగనతలాన్ని మూసేస్తున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. దీంతో ఎయిర్ మిషన్ సూచన మేరకు అధికారులు విమానాన్ని మళ్లీ భారత్‌కు మళ్లించారు.
కాగా, కీవ్ నుంచి బయల్దేరిన ఓ విమానం గురువారం ఉదయం 7.45 గంటలకు ఢీల్లీకి చేరింది. అందులో 182 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు.
గతంలో ఉక్రెయిన్‌లో జరిగిన అంతర్గత పోరులో మలేషియాకు చెందిన విమానం కూలిపోయింది. 2014లో రష్యా అనుకూల వేర్పాటువాదులు, ఉక్రెయిన్ సైన్యానికి మధ్య భీకర పోరు జరిగింది. ఈ క్రమంలో వేర్పాటువాదులు మలేషియా విమానాన్ని కూల్చివేశారు. దీంతో విమానంలోని 298 మంది మృతిచెందారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

