Air India | ఎయిర్ ఇండియా విమానం రష్యాకు మళ్లింపు..!
Air India | ఢిల్లీ నుంచి శాన్ఫ్రాన్సిస్కో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని రష్యాకు మళ్లించారు. విమానం ఇంజిన్లో సాంకేతిక లోపమే ఇందుకు కారణమని చెబుతున్నారు. విమానంలో 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నారు.
Air India | ఢిల్లీ నుంచి శాన్ఫ్రాన్సిస్కో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని రష్యాకు మళ్లించారు. విమానం ఇంజిన్లో సాంకేతిక లోపమే ఇందుకు కారణమని చెబుతున్నారు. విమానంలో 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నారు. ఇంజిన్ ఫెయిల్యూర్ కారణంగా ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో విమానాన్ని రష్యాలోని మగదాన్కు మళ్లించినట్లు ఎయిర్ ఇండియా అధికారులు పేర్కొన్నారు. విమానం అక్కడ సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని తెలిపింది.
ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు ఎయిర్ ఇండియాకు చెందిన AI173 విమానం బయలుదేరింది. కొద్దిసేపటి తర్వాత ఓ ఇంజిన్లో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలెట్ రష్యాలోని సమీపంలోని మగదాన్ విమానాశ్రయాన్ని సంప్రదించి అత్యవసర ల్యాండింగ్కు అనుమతి కోరారు. ఇందుకు అనుమతి ఇవ్వడంతో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ప్రయాణికులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని, వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఎయిర్ ఇండియా అధికారులు పేర్కొన్నారు. విమానాన్ని బృందం పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

