గురుగ్రామ్ : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్న ఎయిర్‌హోస్టెస్ (46)పై లైంగిక దాడి జరిగింది. గురుగ్రామ్ పోలీసులకు ఆమె ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలు ఎయిర్‌లైన్ శిక్షణ కోసం గురుగ్రామ్ వచ్చారు. ఆమె బస చేసిన హోటల్లోని స్విమ్మింగ్ పూల్‌లో మునిగిపోవడంతో ఆమెను ఓ దవాఖానలో చేర్చారు. అనంతరం ఈ నెల 6న మరో దవాఖానకు తరలించారు. అక్కడ ఆమె వెంటిలేటర్‌పై స్పృహ కోల్పోయిన స్థితిలో ఉండగా, దవాఖాన సిబ్బంది ఆమెను అనుచితంగా తాకినట్లు ఆమె గుర్తించారు. అయితే, నిస్సహాయ స్థితిలో ఉన్నందువల్ల ఆమె గట్టిగా అరవడం కానీ, నిరోధించడం కానీ చేయలేకపోయారు. ఈ లైంగిక దాడి జరిగినపుడు ఆమె వద్ద ఇద్దరు నర్సులు ఉన్నారు. కానీ వారు జోక్యం చేసుకోలేదు. ఈ నెల 13న ఆమెను దవాఖాన నుంచి ఇంటికి పంపించారు. ఆమె తన భర్తకు జరిగిన విషయాన్ని తెలిపారు.