Rival viral songs | పశ్చిమ బెంగాల్లో చిన్నా పెద్దల్ని ఆకర్శించేందుకు పల్లీలు అమ్ముకునే వ్యక్తి పాడిన ‘కచ్చా బాదాం’ పాట ఎంతగా ప్రాచుర్యం పొందిందో తెలిసిందే. ఈయన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ఎన్నో ఆల్బంలు రావడానికి దోహదపడింది. ఈ వీడియో మార్కోట్లోకి వచ్చిన తర్వాత ఏ ఫంక్షన్లో చూసినా ఈ పాటపై డ్యాన్స్ చేస్తూ కుర్రకారు ఉర్రూతలూగారు.
ఈ పాట మాదిరి పాటలు మరెన్నో అక్కడక్కడా వినిపిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా నింబూ షర్బత్, జామకాయల అమ్మకం ఉన్నాయి. నిమ్మ రసంతో సోడా కలిపి షర్బత్ అమ్ముకునే ఓ వ్యక్తి ‘బాకీ లేమన్ బాద్ విచ్ పావుంగా..’ అంటూ ఆకట్టుకుంటున్నాడు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది.
ఇప్పుడు జామకాయ పాట ఇంటర్నెట్ను ఆహ్లాదపరుస్తున్నది. ఈ వీడియోలో ఓ వ్యక్తి జామ పండ్లు అమ్మడానికి కొత్త జింగిల్‌ని వాడాడు. ‘యే హరి హరి, కచ్చి కచ్చి, పీలీ పీలీ, పాకీ పాకీ, మీతీ మీతీ, గద్దర్ గద్దర్, తాజా తాజా, నమక్ లగా కే ఖాజ్ ఖాజా..’ అని ఆ వ్యక్తి పాడుతూ కొనుగోలుదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడు.
27 సెకండ్ల నిడివి గల ఈ వీడియో మొదట యూట్యూబ్‌లో షేర్ అయింది. తర్వాత మిగతా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో దుమ్మురేపుతున్నది. రానున్న రోజుల్లో నిమ్మకాయ షెర్బత్ సాంగ్, జామకాయ సాంగ్‌లపై యువకులు డ్యాన్స్ చేయడం మనం చూస్తాం.