Students Hospitalised After Gas Leak | ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్.. 8 మంది విద్యార్థులు ఆసుపత్రిపాలు
Students Hospitalised After Gas Leak | ఒక ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో 8 మంది నర్సింగ్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వారిని తరలించి చికిత్స అందిస్తున్నారు. రసాయనాలున్న ఆ ట్యాంకర్‌ను జనాలకు దూరంగా తరలించారు.
తిరువనంతపురం: ఒక ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో 8 మంది నర్సింగ్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వారిని తరలించి చికిత్స అందిస్తున్నారు. రసాయనాలున్న ఆ ట్యాంకర్‌ను జనాలకు దూరంగా తరలించారు. (Students Hospitalised After Gas Leak) కేరళలోని కన్నూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం కర్ణాటక నుంచి కేరళలోని ఎర్నాకులం వెళ్తున్న ట్యాంకర్ లారీ నుంచి హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీకైంది. రామాపురంలో ఆ ట్యాంకర్‌ను నిలుపడంతో ఆ ప్రాంతంలోని నర్సింగ్ కాలేజీకి చెందిన 8 మంది విద్యార్థులు అస్వస్థత చెందారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. దీంతో పరియారం మెడికల్ కాలేజీ ఆసుప్రతి, పజయంగడి ఆసుపత్రికి వారిని తరలించి చికిత్స అందించారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఆ ట్యాంకర్ వద్దకు చేరుకున్నారు. కంటైనర్ వెనుక వాల్వ్‌లో లీకేజీని గుర్తించారు. అయితే గ్యాస్ లీక్‌ను పూర్తిగా అరికట్టలేకపోయారు. దీంతో ఆ వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ట్యాంకర్‌లోని గ్యాస్‌ను మరో ట్యాంకర్‌లోకి తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనారోగ్యానికి గురైన నర్సింగ్ విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

