Shraddha murder case | అఫ్తాబ్ ఇంట్లోనే శ్రద్ధ హత్య జరిగిందని గుర్తించలేకపోయా.. పోలీసుల ఎదుట కొత్త స్నేహితురాలు
Shraddha murder case | శ్రద్ధా హత్య కేసులో రోజుకో కొత్త విషయాలు ఆసక్తి రేపుతున్నాయి. అఫ్తాబ్ ఇంటికి వచ్చినప్పుడు శ్రద్ధ శరీరం ముక్కలను అక్కడే దాచినట్లు తాను గ్రహించలేదని, ఆయన్ను తానెప్పుడూ భయంతో చూడలేదని పోలీసులకు చెప్పింది.
Shraddha murder case | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధావాల్కర్ హత్యకేసులో పలు కథనాలు ఆసక్తి రేపుతున్నాయి. శ్రద్ధాను చంపినందుకు తానేమీ బాధపడటం లేదని అఫ్తాబ్ పోలీసుల ఎదుట చెప్పగా.. అఫ్తాబ్ ఇంటికి రెండు సార్లు వెళ్లినా అక్కడే శ్రద్ధ హత్య జరిగినట్లు గుర్తించలేకపోయానని అఫ్తాబ్ కొత్త గర్ల్‌ఫ్రెండ్ చెప్తున్నది. శ్రద్ధా హత్య కేసులో అఫ్తాబ్ కొత్త స్నేహితురాలు తెరపైకి రావడంతో పోలీసులు ఆమెను కూడా ప్రశ్నిస్తున్నారు. శ్రద్ధ చేతికున్న ఉంగరాన్ని కొత్త స్నేహితురాలికి తొడిగి డేటింగ్ చేస్తున్నట్లు అఫ్తాబ్ ఒప్పుకున్నట్లు సమాచారం.
అఫ్తాబ్ కొత్త స్నేహితురాలు పోలీసులకిచ్చిన స్టేట్మెంట్లో శ్రద్ధావాల్కర్ హత్యతో గానీ, ఆమె శరీరం ముక్కలతో గానీ తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆయన్ను కలిసేందుకు అఫ్తాబ్ ఇంటికి వచ్చినప్పుడు శ్రద్ధా శరీరం ముక్కలను ఆ ఇంట్లోనే దాచిన విషయం తాను గుర్తించలేదని చెప్పింది. అఫ్తాబ్‌ను తాను ఎప్పుడూ భయంతో చూడలేదని కూడా పేర్కొన్నది. మే నెలలో శ్రద్ధ హత్య తర్వాత అఫ్తాబ్ ఈ కొత్త స్నేహితురాలితో డేటింగ్ ప్రారంభించాడు. అక్టోబర్‌లో రెండుసార్లు అఫ్తాబ్ ఇంటికి వచ్చినట్లు చెప్పిన కొత్త స్నేహితురాలు.. అక్టోబర్ 12న అఫ్తాబ్ తనకు ఉంగరాన్ని ఇచ్చాడని పోలీసులకు తెలిపింది. పోలీసులు ఆమె నుంచి ఉంగరాన్ని స్వాధీనం చేసుకుని స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు.
శ్రద్ధ హత్య కేసు బయటకు రాగానే అఫ్తాబ్ కొత్త స్నేహితురాలు షాక్‌కు గురైంది. అతడి భయంకరమైన చర్య గురించి తెలుసుకుని కలత చెందింది. ఈ షాక్ నుంచి బయటపడేందుకు తనకు కౌన్సెలింగ్ అవసరమని ఆమె చెప్పిందని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇలాఉండగా, అఫ్తాబ్ కొత్త స్నేహితురాలు మానసిక వైద్యురాలుగా పనిచేస్తున్నట్లు సమాచారం. కాగా, అఫ్తాబ్ వివిధ డేటింగ్ యాప్‌లలో దాదాపు 15-20 మంది అమ్మాయిలతో కాంటాక్ట్‌లో ఉన్నట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

