బెంగళూరు : దేశీయంగా తయారైన భారత రక్షణ విమానాల పరాక్రమాన్ని ప్రదర్శించేందుకు..‘ఏరో ఇండియా 2025’ వేదిక కాబోతున్నది. సోమవారం బెంగళూరులో ఉదయం 10.20 గంటలకు వైమానిక ప్రదర్శనలు ప్రారంభమవుతున్నాయి.
ఆదివారం యలహంక వైమానిక కేంద్రం వద్ద ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీ, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్‌లు ఇద్దరూ ఒకే తేజస్ ఫైటర్ నడిపారు. ఎయిర్ చీఫ్, ఆర్మీ చీఫ్‌లు ఇద్దరూ ఒకే యుద్ధ విమానాన్ని నడపటం ఇదే మొదటిసారి. తొలిసారిగా రష్యాకు చెందిన ఎస్‌యూ-57, అమెరికాకు చెందిన ఎఫ్-35 లైటినింగ్-2.. ఏరో ఇండియాలో పాల్గొంటున్నాయి.