న్యూఢిల్లీ, మార్చి 24: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ‘కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, నటుడు అనుపమ్ ఖేర్ హాజరుకానున్నారు. వీరితోపాటు ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్, బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, పలువురు సాధువులు హాజరవుతారు.