చెన్నై: ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. తన థియేటర్లో పనిచేసిన ఉద్యోగుల ఈఎస్ఐ బకాయిలు చెల్లించడంలో విఫలమైనందుకు ఆమెతో పాటు మరో ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.ఐదు వేల చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది.