ముంబై, నవంబర్ 11: ప్రముఖ టీవీ నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ(46) హఠాన్మరణం చెందారు. శుక్రవారం జిమ్లో వ్యాయామం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ముంబైలోని ఓ దవాఖానకు తరలించారు. వైద్యు లు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. జిమ్లో ఉన్నప్పుడు గుండెపోటు వచ్చినట్టున్నదని వైద్యులు సిద్ధాంత్ వీర్ కుటుంబసభ్యులకు తెలిపినట్టు దవాఖాన వర్గాలు పేర్కొన్నాయి. కుసుమ్, కసౌటి జిందగీ కే, కంట్రోల్ రూమ్, జిద్దీ దిల్ మానే నా, భాగ్యవిధాత వంటి పలు షోలతో సిద్ధాంత్ వీర్ పాపులర్ అయ్యారు. సిద్ధాంత్ వీర్ మృతి పట్ల పలువురు టీవీ నటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.