Actor Darshan | బెంగళూరు, జూన్ 22: అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్, మరో నలుగురికి కోర్టు శనివారం జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
జూన్ 11 నుంచి పోలీస్ కస్టడీపై ఉన్న నిందితులకు జూలై 4 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో నటుడు దర్శన్ సహా మిగతావారిని బెంగళూరులోని పరప్పనా అగ్రహారలోని సెంట్రల్ జైల్‌కు తరలించారు. ఈ హత్య కేసులో మొత్తం 17 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు.