ముంబై, నవంబర్ 2: జీఎమ్మార్ గ్రూప్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎస్జీకే కిశోర్.. ప్రపంచ విమానాశ్రయ నిర్వాహకుల అత్యున్నత సంఘం ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ)లోని ఏపీఏసీ, మిడిల్ ఈస్ట్ విభాగాల నూతన అధ్యక్షుడిగా నియమితులయ్యారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని శనివారం జీఎమ్మార్ గ్రూప్ ఓ ప్రకటనలో తెలియజేసింది.
హాంకాంగ్ ప్రధాన కేంద్రంగా ఈ ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్ ఏసీఐ విభాగం నడుస్తున్నది. ప్రస్తుతం కిశోర్ జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న విషయం తెలిసిందే.