World of Statistics | భారతీయుల సగటు జీతం రూ.46,861 మాత్రమే
World of Statistics | ఉద్యోగులు, కార్మికుల సగటు నెలవారీ జీతం విషయంలో భారత్ చాలా దేశాల కంటే వెనుకబడిందని ‘ది వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్' సంస్థ పేర్కొన్నది. భారత్లో సగటు నెల జీతం రూ.46,861గా ఉన్నదని తెలిపింది. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాల్లో ఉన్న సగటు నెలవారీ జీతాలకు సంబంధించిన గణాంకాలను వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సోమవారం విడుదల చేసింది.
- రూ.5 లక్షలతో స్విట్జర్లాండ్ టాప్
- 65వ స్థానంలో ఇండియా
- ది వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక వెల్లడి
World of Statistics | న్యూఢిల్లీ, మే 1: ఉద్యోగులు, కార్మికుల సగటు నెలవారీ జీతం విషయంలో భారత్ చాలా దేశాల కంటే వెనుకబడిందని ‘ది వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్’ సంస్థ పేర్కొన్నది. భారత్లో సగటు నెల జీతం రూ.46,861గా ఉన్నదని తెలిపింది. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాల్లో ఉన్న సగటు నెలవారీ జీతాలకు సంబంధించిన గణాంకాలను వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సోమవారం విడుదల చేసింది. ఈ డాటా ప్రకారం.. మన కరెన్సీలో లక్ష రూపాయాల కంటే అధిక సగటు నెల వేతనం 23 దేశాల్లో ఉన్నది. ఈ లిస్టులో రూ.50 వేల కంటే తక్కు వ సగటు వేతనంతో భారత్ 65వ స్థానంలో ఉండటం గమనార్హం. రూ.4,98,567 సగటు వేతనంలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో లక్సెంబర్గ్, సింగపూర్, అమెరికా ఉన్నాయి. చైనాలో సగటు నెల వేతనం రూ.87,426గా ఉన్నది. భారత్ కంటే వెనుకబడిన దేశాల జాబితాలో బ్రెజిల్, అర్జెంటీనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటివి ఉన్నాయి.
ఐదేండ్లలో 1.4 కోట్ల ఉద్యోగాలు ఉఫ్: డబ్ల్యూఈఎఫ్
భవిష్యత్తు ఉద్యోగాల తీరుతెన్నులపై వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్టు-2023’ పేరిట తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. వచ్చే ఐదేండ్ల కాలంలో 6.9 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించే యోచనలో యాజమాన్యాలు ఉన్నాయని తెలిపింది. ఇదే సమయంలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో 8.3 కోట్ల ఉద్యోగాలు కనుమరుగవుతాయని, తద్వారా ప్రస్తుత మొత్తం ఉపాధిలో 1.4 కోట్ల ఉద్యోగాలకు (2 శాతం) కోత పడుతుందని వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ మందగమనం, కంపెనీలు కృత్రిమ మేధ వంటి సాంకేతికతను అందిపుచ్చుకోవడమే ఇందుకు కారణమని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 903 కంపెనీల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ విషయాలను వెల్లడించింది. కొత్త టెక్నాలజీ, డిజిటలైజేషన్ కారణంగా బ్యాంక్ టెల్లర్స్, క్యాషియర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు వంటి క్లరికల్ ఉద్యోగాల్లో మెజార్టీ కోత పడే అవకాశం ఉన్నదని డబ్ల్యూఈఎఫ్ అంచనా వేసింది.
సగటు నెల జీతంలో టాప్-5 దేశాలు(రూ.ల్లో)
స్విట్జర్లాండ్ – రూ.4,98,567
లక్సెంబర్గ్ – రూ.4,10,156
సింగపూర్ – రూ.4,08,030
అమెరికా – రూ.3,47,181
ఐస్లాండ్ – రూ.3,27,716
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

