న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 16: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) శుక్రవారం అరెస్ట్ చేసింది. ఖాన్ చైర్మన్‌గా ఉన్న ఢిల్లీ వక్ఫ్ బోర్డు నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలకు సంబంధించిన కేసులో ఖాన్‌తోపాటు అతడి అనుచరుల ఇండ్లలో ఏసీబీ శుక్రవారం సోదాలు నిర్వహించింది.
ఈ సందర్భంగా రూ.24 లక్షలతోపాటు అక్రమ ఆయుధాలను సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ కేసులో సాక్షులను అమానతుల్లాఖాన్ బెదిరించే అవకాశం ఉన్నందున అతడిని వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటేరియట్‌కు ఏసీబీ లేఖ రాసింది.