Priyanka Chaturvedi | ‘కచ్చితంగా అది సిగ్గులేని చర్య’.. WCL టోర్నీకి బీసీసీఐ అనుమతిపై శివసేన ఎంపీ
Priyanka Chaturvedi | భారత క్రికెట్ జట్టు ‘వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టోర్నీ’లో పాల్గొంటుండటాన్ని శివసేన యూబీటీ (Shiva Sena - UBT) ఎంపీ ప్రియాంక చతుర్వేది (Priyanka Chaturvedi) తప్పుపట్టారు.
Priyanka Chaturvedi : భారత క్రికెట్ జట్టు ‘వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టోర్నీ’లో పాల్గొంటుండటాన్ని శివసేన యూబీటీ (Shiva Sena – UBT) ఎంపీ ప్రియాంక చతుర్వేది (Priyanka Chaturvedi) తప్పుపట్టారు. WCL టోర్నీలో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా భారత ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య ఈ నెల 20న మ్యాచ్ జరుగనుంది.
ఈ టోర్నీకి బీసీసీఐ భారత జట్టును అనుమతించడంపై చతుర్వేది మండిపడ్డారు. ఇది సిగ్గులేని చర్య అని విమర్శించారు. ఇండియా-పాకిస్థాన్ ఉద్రిక్తల నడుమ జాతీయ భావోద్వేగాలను పట్టించుకోకపోవడంపై తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’లో మండిపడ్డారు. డబ్ల్యూసీఎల్కు భారత జట్టును అనుమతించడం కచ్చితంగా సిగ్గులేని చర్య అని అన్నారు. పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధాలు లేవని భారత ప్రభుత్వం చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు.
పహల్గాం ఉగ్రవాదులను పట్టుకోకముందే పాక్‌తో మ్యాచ్‌లకు అనుమతించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. పహల్గాం ఉగ్రదాడిలో తమవారిని కోల్పోయిన కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయి ఉంటే బీసీసీఐ, ఐసీసీలు తమ డబ్బు గురించి ఆలోచించడం నైతిక దివాళాకోరుతనాన్ని సూచిస్తుందని చతుర్వేది ఘాటుగా విమర్శించారు. అయితే చతుర్వేది విమర్శలపై బీసీసీఐ కానీ, మ్యాచ్‌లో పాల్గొననున్న భారత క్రికెటర్లుగానీ స్పందించలేదు.
Read More >>
రద్దీ రోడ్డుపైకి ఎనిమిది అడుగుల భారీ మొసలి.. జనం చూసేందుకు ఎగబడటంతో ట్రాఫిక్ జామ్
ఉక్రెయిన్‌పై మళ్లీ విరుచుకుపడ్డ రష్యా.. 300కు పైగా డ్రోన్లతో దాడి
‘ఇంకా చావడంలేదు ఏం చేయాలి’.. భర్తను చంపుతూ ప్రియుడితో భార్య చాటింగ్
బావతో వివాహేతర బంధం.. ఇద్దరూ కలిసి భర్తను ఎంత ప్లాన్‌గా చంపారో తెలుసా..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

