డీఆర్డీవో ‘అభ్యాస్’ పరీక్ష విజయవంతం

భువనేశ్వర్: హై స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్, ‘అభ్యాస్’ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చందీపూర్ టెస్ట్ రేంజ్ నుంచి దీనిని ప్రయోగించి పరీక్షించింది. ట్రయల్ రన్ సమయంలో పలు సాంకేతిక అంశాలను పరిశీలించింది. గ్రౌండ్-బేస్డ్ కంట్రోలర్ నుండి సబ్‌సోనిక్ వేగంతో ఎగిరిన అభ్యాస్ ముందుగా నిర్ణయించిన లక్ష్యాన్ని ఛేదించింది. 2019 మేలో తొలిసారి దీనిని విజయవంతంగా పరీక్షించారు. వాయు టార్గెట్లకు వినియోగించే వివిధ క్షిపణి వ్యవస్థల మూల్యాంకనం కోసం గ్రౌండ్-బేస్డ్ కంట్రోలర్ వాహనాన్ని వినియోగిస్తారు.
భారత సాయుధ దళాల కోసం ‘అభ్యాస్’ను డీఆర్డీవోకు చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఏడీఈ) 2012 నుంచి అభివృద్ధి చేస్తున్నది. ఉపరితలం నుండి గాల్లోకి, ఎయిర్-టు-ఎయిర్ ఇంటర్సెప్షన్ క్షిపణులను పరీక్షించే విమానాలను ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. టార్గెట్ రాడార్ రిఫ్లెక్టివిటీ, ఎకౌస్టిక్ మిస్ డిస్టెన్స్ ఇండికేటర్ (AMDI) వ్యవస్థను మెరుగుపరచడానికి ముక్కు కోన్‌లో లూన్‌బర్గ్ లెన్స్‌తో సర్దుబాటు చేయగల రాడార్ క్రాస్-సెక్షన్‌ను ఇది కలిగి ఉంటుంది.
పూర్తిగా స్వయంప్రతిపత్తిగా ఎగిరే అభ్యాస్, గ్యాస్ టర్బైన్ ఇంజిన్ ఆధారంగా పని చేస్తుంది. నావిగేషన్ కోసం మైక్రో ఎలక్ట్రోమెకానికల్ సిస్టమ్‌లను ఉపయోగించారు. ఫ్లైట్ మార్గదర్శకత్వం, నియంత్రణను కంప్యూటర్ ద్వారా నిర్వహిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

