ఈడీ కేసులో మమత మేనల్లుడికి చుక్కెదురు

- సమన్లు కొట్టివేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి చుక్కెదురైంది. బొగ్గు కుంభకోణం కేసులో తమ ముందు హాజరుకావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసిందని, ఈ సమన్లను తోసిపుచ్చేలా ఆదేశాలు జారీ చేయాలన్న ఆయన విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్పై మూడు రోజుల్లోగా స్పందనను తెలియజేయాలని ఈడీని కోర్టు కోరింది. పశ్చిమబెంగాల్లో జరిగిన బొగ్గు కుంభకోణంలో అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిరా బెనర్జీ పాత్ర ఉన్నదని పేర్కొంటూ కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో హవాలా లావాదేవీలపై దృష్టిసారించిన ఈడీ మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

