Arvind Kejriwal | ఢిల్లీ ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ వ్యతిరేకించకపోతే.. విపక్షాల సమావేశాన్ని బహిష్కరించనున్న ఆప్
Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీపై పెత్తనం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ వ్యతిరేకించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) డిమాండ్ చేసింది. లేనిపక్షంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో శుక్రవారం పాట్నాలో జరుగనున్న విపక్షాల మెగా సమావేశాన్ని బహిష్కరిస్తామని పరోక్షంగా హెచ్చరించింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీపై పెత్తనం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ వ్యతిరేకించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) డిమాండ్ చేసింది. లేనిపక్షంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో శుక్రవారం పాట్నాలో జరుగనున్న విపక్షాల మెగా సమావేశాన్ని బహిష్కరిస్తామని పరోక్షంగా హెచ్చరించింది. అయితే మెగా విపక్షాల సమావేశంలో ఢిల్లీ ఆర్డినెన్స్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చి చర్చించాలని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కోరారు. పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదం పొందింతే బీజేపీయేతర రాష్ట్రాల అధికారాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చట్టాల ద్వారా హరిస్తుందని హెచ్చరించారు. అందుకే ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు స్పష్టత కలిగి ఉండాలంటూ ప్రతిపక్ష పార్టీల అధినేతలకు ఆయన లేఖ రాశారు.
కాగా, కాంగ్రెస్, ఆప్ మధ్య వార్ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్ష పార్టీల మద్దతు కూడగట్టేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెగ ప్రయత్నిస్తున్నారు. బీజేపీ యేతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల చీఫ్‌లు, సీఎంలను ఆయన కలిశారు. అలాగే ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇచ్చేలా విపక్ష పార్టీలు కృషి చేయాలని కేజ్రీవాల్ కోరారు. శుక్రవారం పాట్నాలో జరుగనున్న విపక్షాల భారీ సదస్సులో చర్చించే వాటిలో ఢిల్లీ ఆర్డినెన్స్ మొదటి అంశం కావాలని పేర్కొన్నారు. లేని పక్షంలో ఆ సమావేశాన్ని బహిష్కరించాలని ఆప్ భావిస్తున్నట్లు సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

