Arvind Kejriwal | బెయిల్ ఉత్తర్వులు రాకముందే కోర్టులో ఎలా సవాల్ చేస్తారు : ఈడీ తీరుపై ఢిల్లీ మంత్రి ఫైర్
Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఝలక్ ఇచ్చింది. మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించింది.
Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఝలక్ ఇచ్చింది. మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించింది. హైకోర్టు ఉత్తర్వులపై ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ తీవ్రంగా స్పందించారు.
ఇలాంటి ఘటనను ఎన్నడూ గతంలో వినలేదు..దిగువ కోర్టు బెయిల్ ఉత్తర్వులు ఇంతవరకూ అప్లోడ్ కాలేదు..తాము వాటిని ఇంకా తీసుకోలేదు..అసలు ఉత్తర్వులే వెలువడనప్పుడు హైకోర్టు ఏం విచారిస్తుందని ఆయన ప్రశ్నించారు. అసలు ఈడీ ఏ ఆధారాలతో కోర్టును ఆశ్రయించిందని నిలదీశారు. ఈ అంశాన్ని విచారిస్తామని న్యాయస్ధానం ఏ ప్రాతిపదికన చెబుతుందని విస్మయం వ్యక్తం చేశారు. అసలు బెయిల్ ఉత్తర్వులు వెలువడకముందే ఈడీ ఏం సవాల్ చేస్తుందని అన్నారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత కక్షతో ఇదంతా చేస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర ఏజెన్సీ వ్యవహరించాల్సిన పద్ధతి ఇది కాదని ఈడీకి హితవు పలికారు. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ ( liquor policy case)కి సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు రౌస్ అవెన్యూ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
ఢిల్లీ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లేందుకు బెయిల్ ఉత్తర్వులపై 48 గంటల పాటు నిలుపుదల చేయాలన్న ఈడీ అభ్యర్థనను ప్రత్యేక జడ్జి నియయ్ బిందు గురువారం తిరస్కరించారు. రూ.లక్ష వ్యక్తిగత బాండ్ పూచీకత్తుపై కేజ్రీవాల్‌ను విడుదల చేయాలని ఆదేశించారు. అయితే, ట్రయల్ కోర్టు తీర్పును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేజ్రీవాల్ బెయిల్‌పై హైకోర్టులో సవాల్ చేసింది.
Read More :
Back Pain | నడకతో వెన్నునొప్పి మటుమాయం!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

