AAP | మోదీ లక్ష్యంగా ఆప్ పోస్టర్ వార్ ముమ్మరం
కేంద్రంలో బీజేపీ సారధ్యంలోని నరేంద్ర మోదీ సర్కార్‌పై అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పోరు ఉధృతం చేసింది. మోదీ హఠావో దేశ్ బచావో పోస్టర్లతో ఢిల్లీలో కాషాయ సర్కార్‌కు వ్యతిరేకంగా పోస్టర్లతో హోరెత్తించిన ఆప్ (AAP) దేశవ్యాప్తంగా తన క్యాంపెయిన్‌ను ముమ్మరం చేసింది.
న్యూఢిల్లీ : కేంద్రంలో బీజేపీ సారధ్యంలోని నరేంద్ర మోదీ సర్కార్‌పై అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పోరు ఉధృతం చేసింది. మోదీ హఠావో దేశ్ బచావో పోస్టర్లతో ఢిల్లీలో కాషాయ సర్కార్‌కు వ్యతిరేకంగా పోస్టర్లతో హోరెత్తించిన ఆప్ (AAP) దేశవ్యాప్తంగా తన క్యాంపెయిన్‌ను ముమ్మరం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 11 భాషల్లో పోస్టర్ క్యాంపెయిన్‌ను గురువారం చేపట్టింది. ప్రధాని విద్యార్హతలపై మోదీని లక్ష్యంగా చేసుకుని ఆప్ పోస్టర్ వార్‌కు తెరలేపింది. భారత ప్రధానికి విద్యార్హతలు ఉండాల్సిన అవసరం ఉందా అని దేశ రాజధానిలో ఏర్పాటు చేసిన పోస్టర్లలో ఆప్ ప్రశ్నించింది.
బీజేపీయేతర ప్రభుత్వాలను మోదీ సర్కార్ తొక్కిపెడుతోందని ఆప్ సహా విపక్షాలు భగ్గుమంటున్నాయి. కాగా, మోదీ సర్కార్ లక్ష్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee ) విమర్శలతో విరుచుకుపడ్డారు. దేశంలో సమాఖ్య వ్యవస్ధకు బీజేపీ తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. టీఎంసీ ఆధ్వర్యంలో కోల్‌కతాలో చేపట్టిన నిరసన దీక్షలో దీదీ మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. బీజేపీయేతర రాష్ట్రాలను కాషాయ పాలకులు ఎదగకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. మన జీఎస్టీ సొమ్మునూ కేంద్ర పాలకులు లూటీ చేస్తున్నారని మండిపడ్డారు.
వందరోజుల పని డబ్బును కూడా వారు నిలుపుదల చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మనం దేశ వ్యతిరేకులమని, వారే నిజమైన జాతీయ వాదులని ప్రచారం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దేశం పట్ల మనకు ప్రేమ లేదనే ఆలోచనా ధోరణితో వ్యవహరిస్తున్న కేంద్ర పాలకుల కండ్లు తెరిపిస్తామని అన్నారు. బీజేపీ నేతలు ఫ్యూడల్ దొరల్లా వ్యవహరిస్తూ వారికి వ్యతిరేకంగా జరిగే నిరసనలను చూపరాదని న్యూస్ ఛానెళ్లపై ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు.
తమ ధర్నాను ప్రసారం చేయవద్దని బీజేపీ అన్ని న్యూస్ ఛానెళ్లపై ఒత్తిడి తెచ్చిందని దీదీ అన్నారు. ప్రజాస్వామ్యానికి మీడియా నాలుగో స్తంభమని, మన ప్రజాస్వామ్యాన్ని బీజేపీ దెబ్బతీస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిపైకి ఈడీ, సీబీఐలను ప్రయోగిస్తున్నారని ధ్వజమెత్తారు. తాను విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు కిరాయి మూకలకు డాలర్లను ఎరగా వేసి తనకు నల్ల జెండాలు చూపేలా బీజేపీ వ్యవహరించిందని దీదీ దుయ్యబట్టారు.
Read More
Adani Janata party | ప్రధాని మోదీకి అదానీనే జనతా, అదానీనే శ్రీరాముడు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AAP
- Arvind Kejriwal
- poster war
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

