న్యూఢిల్లీ, జనవరి 2: నీటిలోని ప్లాస్టిక్ సూక్ష్మవ్యర్థాలతో పాటుగా ఇతర కలుషితాలను సమర్థంగా, తక్కువ సమయంలో తొలగించే కొత్త వాటర్ ఫిల్టర్‌ను కొరియా శాస్త్రవేత్తలు రూపొందించారు. సౌర ఆధారిత నీటి వడపోత వ్యవస్థ తయారీకి ముడి పదార్థాల ఖర్చూ తక్కువే ఉంటుందని అంటున్నారు. నీటిశుద్ధిలో ఈ సాంకేతికత ప్రపంచంలోనే అత్యున్నతమైనదని అడ్వాన్స్డ్ మెటీరియల్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ వ్యాసంలో పేర్కొన్నారు. కొత్త ఫిల్టర్ నీటిలోని ఫినోలిక్ మైక్రోప్లాస్టిక్స్‌ను, సేంద్రియ కాలుష్యాలను 99.9 శాతం అత్యంత వేగంగా తొలగిస్తుందని కొరియాలోని దైగూ గ్యోంబుక్ ఇన్స్టిట్యూటైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్ పార్క్ చియూంగ్ అన్నారు. ఇందులో ఉపయోగించే వడపోత పదార్థం కీలకమైందని, త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు.