వైరల్ వీడియో : చిన్నారికి చదువు చెప్పే పద్ధతి ఇదేనా..!
తల్లితో కలిసి చదువుతున్న ఓ బాలుడు పదేపదే ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై చిరాకుపడిన నెటిజన్లు చిన్నారికి చదువు చెప్పే తీరు ఇదేనా అంటూ మహిళపై మండిపడ్డారు.
న్యూఢిల్లీ : తల్లితో కలిసి చదువుతున్న ఓ బాలుడు పదేపదే ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై చిరాకుపడిన నెటిజన్లు చిన్నారికి చదువు చెప్పే తీరు ఇదేనా అంటూ మహిళపై మండిపడ్డారు. ఈ వైరల్ వీడియోలో తల్లి చదువు చెబుతుండగా చిన్నారి భయపడుతూ హోంవర్క్ చేస్తుండటం కనిపించింది.
1-10 వరకూ కౌంట్ చేసే క్రమంలో తల్లి తనను ఎక్కడ కొడుతుందనే భయం బాలుడిలో కనిపించింది. మిని చందన్ ద్వివేది అనే యూజర్ ఇన్‌స్టాగ్రాంలో ఈ వీడియోను షేర్ చేయగా ఇప్పుడది వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ దశలో బాలుడు తల్లిని తనను కొడుతుందా లేదా అని అడుగుతుండటం వినిపించింది. ఆమె కోపం చల్లార్చేందుకు బాలుడు తల్లికి ముద్దివ్వడం కనిపించింది.
వీడియో చివరిలో బాలుడిని తల్లి ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతూ కన్నీళ్లను తుడవడం కనిపిస్తుంది. ఈ ఘటనపై నెటిజన్లు అసంతృప్తితో రగులుతూ మీరంటే ఎందుకు మీ కొడుకు అంతలా భయపడుతున్నాడని ప్రశ్నించారు. అసలు చదువు చెప్పే తీరు ఇదేనా అంటూ మరికొందరు యూజర్లు మండిపడ్డారు. ఈ వీడియోను ఇప్పటివరకూ సోషల్ మీడియాలో ఏకంగా 60 లక్షల మందికిపైగా వీక్షించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- cry
- Study
- toddler
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
BRS | బీఆర్ఎస్ దెబ్బకు దిగొచ్చిన జీఆర్ఎంబీ.. ఏపీ ప్రతిపాదనలు తిరస్కరణ
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
BRS Legal Notice | వెలుగు పత్రికకు బీఆర్ఎస్ నోటీస్.. మాజీ సీఎం ప్రతిష్టను దెబ్బతీసే దుష్టప్రయత్నం
Horoscope | 19-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

