న్యూఢిల్లీ : పెండ్లి వేదికైనా, కాలేజ్‌లో ఫేర్వేల్ పార్టీ అయినా సందర్భమేదైనా కంగనా రనౌత్ నటించిన క్వీన్ మూవీలోని లండన్ తుమక్ద సాంగ్ మోత మోగాల్సిందే. ఈ హుషారైన సాంగ్ ప్రతిఒక్క డీజే ప్లేలిస్ట్‌లో ఉండితీరుతుంది.
తాజాగా ఈ పాటకు నేపాలి మహిళల బృందం తమ డ్యాన్స్‌తో అదరగొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. నేపాల్ రాజధాని ఖట్మండుకు చెందిన ది వింగ్స్ టీమ్ ఈ హుషారైన బీట్‌కు క్రేజీ మూమెంట్స్‌తో నెటిజన్లను ఆకట్టుకుంది.
ఈ క్లిప్‌లో ట్రాక్ ప్యాంట్లు ధరించి నలుగురు మహిళలు కిల్లర్ స్టెప్స్‌తో కిక్కెక్కించారు. భాంగ్రా డ్యాన్స్‌తో ఫుల్ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌తో మగువల బృందం ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకూ ఏకంగా 1.2 కోట్ల మంది వీక్షించారు. ఈ పాటను లభ్ జంఝా ఆలపించగా అమిత్ త్రివేది సంగీతం సమకూర్చారు. ఈ సాంగ్‌కు యూట్యూబ్‌లో 20.4 కోట్ల వ్యూస్ దక్కడం విశేషం