కోజికోడ్: కేరళలో ట్రాన్స్జెండర్ జంట తల్లిదండ్రులయ్యారు. దేశంలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి. తన భాగస్వామి బుధవారం పండంటి బిడ్డను ప్రసవించిందని పావల్ పేర్కొన్నాడు. ఇటీవలే తాము తల్లిడండ్రులం కాబోతున్నామని ప్రకటించిన పావల్, తన భాగస్వామి జహాద్ సిజేరియన్ ఆపరేషన్ ద్వారా బిడ్డను ప్రసవించిందని తెలిపారు.
అయితే పుట్టినది ఆడ శిశువో, మగ శిశువో చెప్పడానికి నిరాకరించిన పావల్ ఆ విషయాన్ని ఇప్పట్లో బహిరంగపర్చదల్చుకోలేదని తెలిపారు. పావల్, జహాద్ గత మూడేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు.