న్యూఢిల్లీ: కేవలం 60 సెకండ్ల పాటు ఒక ప్రత్యేకమైన రెడ్ లైట్‌ను పురుషాంగంపై ప్రసరింపజేస్తే.. అంగస్తంభన సమస్య నుంచి పరిష్కారం లభిస్తుందని తాజా అధ్యయనం పేర్కొన్నది. నార్డ్-1 కాంపౌండ్‌ను అంగం చర్మంలో ప్రవేశపెట్టిన తర్వాత ఒక ప్రత్యేక టార్చ్‌లైట్ ద్వారా కాంతిని ప్రసరింపజేస్తారు.
ఆ కాంతికి నార్డ్-1 స్పందించి నైట్రిక్ ఆక్సైడ్‌ను విడుదల చేస్తుంది. ఇది అంగానికి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సాయం చేస్తుందని, తర్వాత పురుషాంగానికి రక్త ప్రసరణ మెరుగై అంగ స్తంభన సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ తరహా చికిత్స జంతువుల్లో సమర్థవంతంగా పనిచేసిందన్నారు.