తాజ్మహల్లో ఉర్సును నిషేధించండి!
తాజ్మహల్ వద్ద ఉర్సు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ఆగ్రా కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని అఖిల్ భారత్ హిందూ మహాసభ దాఖలు చేసింది.
- మార్చి 4న విచారిస్తామన్న న్యాయస్థానం
ఆగ్రా, ఫిబ్రవరి 3: తాజ్మహల్ వద్ద ఉర్సు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ఆగ్రా కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని అఖిల్ భారత్ హిందూ మహాసభ దాఖలు చేసింది. ఈ నెల 6 నుంచి మూడు రోజుల పాటు ఉర్సు నిర్వహించనున్నారని, దీనిపై నిషేధం విధించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఉర్సు సందర్భంగా తాజ్మహల్లోనికి ఉచిత ప్రవేశానికి అనుమతిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
తాజ్మహల్కు ప్రపంచవ్యాప్తంగా ఓ గుర్తింపు ఉన్నదని, అయితే దీన్ని నిర్మించిన షాజహాన్ చనిపోయిన సందర్భాన్ని పురస్కరించుకొని అక్కడ ఉర్సు నిర్వహించడం తగదని తెలిపింది. వాస్తవానికి తాజ్మహల్ లోపల ఉర్సును నిర్వహించడానికి అప్పట్లో మొఘలులు, బ్రిటీష్ వాళ్లు కూడా అనుమతించలేదని, ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా బయటపడిందని వెల్లడించింది. కాబట్టి ఈ నెల 6 నుంచి జరుగనున్న ఉర్సుపై నిషేధం విధించాలని కోరింది. ఈ పిటిషన్ను స్వీకరించిన న్యాయస్థానం మార్చి 4న విచారణ జరుపుతామని వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

