Mumbai: కల్మా చదవమన్నాడు.. సెక్యూర్టీ గార్డులను కత్తితో పొడిచాడు.. ముంబైలో దారుణం
Mumbai : మతం ఏంటో అడిగాడు. కల్మా చదవమన్నాడు. ఆ తర్వాత కత్తితో ఇద్దరు సెక్యూర్టీ గార్డులపై దాడి చేశాడు. ఈ ఘటన ముంబైలోని నయానగర్‌లో జరిగింది. ఆ ఘటనలో నిందితుడు అన్సారీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
ముంబై: ముంబై(Mumbai)లో ఓ ఉన్మాది కత్తితో దాడి చేశాడు. ఇద్దరు సెక్యూర్టీ గార్డులను పొడిచాడు. వారి మతం అడిగి మరీ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నయా నగర్లో జరిగింది. నిందితుడిని 31 ఏళ్ల జైయిబ్ జుబీర్ అన్సారీగా గుర్తించారు. అయితే దాడికి ముందు అతను బాధితులను ఇస్లాం ప్రవచనం కల్మా చదవాలని బెదిరించినట్లు తెలిసింది. రాజ్‌కుమార్ మిశ్రా, సుబ్రోతో సేన్ .. వాక్‌హార్డ్ ఆస్పత్రి వద్ద ఓ బిల్డింగ్‌లో గార్డులుగా పనిచేస్తున్నారు. అయితే వారికి వద్దకు వెళ్లిన అన్సారీ అటాక్ చేశాడు. సోమవారం ఉదయం 4 గంటలకు ఆ దాడి జరిగినట్లు భావిస్తున్నారు. బాధితులు ఇద్దరూ ఆ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. మిశ్రా స్వయంగా ఆస్పత్రికి వెళ్లారు. తీవ్రంగా గాయపడ్డ సేన్‌ను నయాబ్ షేక్ అనే మరో వ్యక్తి ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
అటాక్ జరిగిన 90 నిమిషాల తర్వాత అన్సారీని అరెస్టు చేశారు. సీసీటీవీ ఫూటేజ్‌ను స్కాన్ చేసి నిందితుడిని పట్టుకున్నారు. నయానగర్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ కేసు నమోదు చేశారు. హత్యాయత్నం, రెండు గ్రూపుల మధ్య శత్రుత్వం రెచ్చగొట్టే కేసులు పెట్టారు. థానే కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టారు. మే 4వ తేదీ వరకు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు.
దాడి పట్ల పోలీసులు, యాంటీ టెర్రర్ స్క్వాడ్ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దు అని పోలీసులు ప్రకటించారు. నిందితుడు అన్సారీకి చెందిన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైస్‌లను సీజ్ చేశారు. ఐసిస్, లోన్ వూల్ఫ్, జిహాద్, గాజా అన్న పదాలు అతని మొబైల్లో రాసి ఉన్నట్లు గుర్తించారు. గతంలో అమెరికాలో అతను నివసించాడు. అన్సారీ కుటుంబం ఇంకా అమెరికాలోనే ఉంటున్నది. అయితే అక్కడ అతనికి జాబ్ దొరకలేదు. దీంతో అతను ఇండియాకు రిటర్న్ వచ్చేశాడు. మీరా రోడ్డు ఏరియాలో అతను ఒంటరిగా నివసిస్తున్నాడు. ఆన్లైన్లో కెమిస్ట్రీ పాఠాలు బోధిస్తూ సంపాదిస్తున్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్‌లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
రైతుల వ్యథలు పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

