ముంబై, మే 23: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని నాలుగు బాయిలర్లు పేలడంతో 8మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని థాణే జిల్లా డోంబివిలిలో గురువారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
ఎంఐడీసీ కాంప్లెక్స్‌లోని అంబర్ కెమికల్ కంపెనీలో మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో నాలుగు బాయిలర్లు పేలి భారీగా మంటలు వ్యాపించినట్టు అధికారులు తెలిపారు. ఫ్యాక్టరీ ఆవరణలో ఉంచిన కెమికల్ డ్రమ్ములకు సైతం మంటలంటుకోవడంతో అవి కూడా పేలి పక్కనున్న గృహాలకు మంటలు వ్యాపించాయి.