న్యూఢిల్లీ, అక్టోబర్ 21: డయాబెటిస్ బారినపడకుండా ఉండాలంటే.. ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న దానిపై అవగాహన ఉండాలి. మధుమేహంతో బాధపడేవారి సంగతి ఇక చెప్పక్కర్లేదు. తమ రోజువారీ ఆహారం విషయంలో మరింత జాగ్రత వహించాల్సిందే. ఇందుకోసం ఐఐటీ గౌహతి సైంటిస్టులు సరికొత్త పరికరాన్ని తయారుచేశారు. వీరు తయారుచేసిన ‘డయాబెటిస్ సెన్సార్’ ఆహార పదార్థాల ైగ్లెసమిక్ ఇండెక్స్ (జీఐ)ని తెలియజేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి ఈ సెన్సార్ చక్కగా ఉపయోగపడుతుందని, తినాలనుకుంటున్న ఆహార పదార్థాల రియల్ టైమ్ జీఐని తెలియజేస్తుందని సైంటిస్టులు తెలిపారు. అన్ని రకాల ఆహార పదార్థాల జీఐని కేవలం 5 నిమిషాల్లో ఈ పరికరం కనుగొంటుందని సైంటిస్టుల బృందానికి నేతృత్వం వహించిన దీపాంకర్ బందోపాధ్యాయ చెప్పారు.