Home
National
A 7 Year Old Male Lion Named Aman Died Today Due To Cardiac Arrest After A Prolonged Illness At Delhi Zoo
గుండె ఆగి సింహం మృతి..!
Lion died: ఢిల్లీ జూలో ఓ ఏడేండ్ల మగ సింహం గుండె ఆగి మృతిచెందింది. మార్చి మొదటి వారం నుంచి అనారోగ్యంతో ఉన్న సింహాన్ని పరిస్థితి విషమించడంతో

న్యూఢిల్లీ: ఢిల్లీ జూలో ఓ ఏడేండ్ల మగ సింహం గుండె ఆగి మృతిచెందింది. మార్చి మొదటి వారం నుంచి అనారోగ్యంతో ఉన్న సింహాన్ని పరిస్థితి విషమించడంతో ఏప్రిల్ 13న జూలోని వెటర్నరీ ఆస్పత్రిలో చేర్చారు. దానిలో క్రానిక్ బ్రాంకైటిస్, సైకలాజికల్ అబ్నార్మాలిటీస్, కాంప్లెక్సిటీస్ ఇన్ మల్టిపుల్ ఆర్గాన్స్తోపాటు వివిధ రకాల ఇన్ఫెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు. పలు ఆస్పత్రుల నుంచి నిపుణులైన వైద్యులు వచ్చి దానికి చికిత్స అందించారు.
అయినా అమన్ కోలుకోలేదు. మే 5న కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహించగా మే 7న రిపోర్టులు వచ్చాయి. ఆ రిపోర్టుల్లో అమన్‌కు కరోనా నెగెటివ్‌గా తేలింది. కానీ, పరిస్థితి విషమించడంతో గుండెపోటు వచ్చి ఈ ఉదయం మృతిచెందింది. వెటర్నరీ డాక్టర్ల బృందం ఆ సింహం కళేబరానికి పోస్ట్‌మార్టం నిర్వహించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

