వినటానికే వింతగా ఉంది కదూ.. వంద మంది కలిస్తే కానీ ఈ ఒక్క దోశను తినలేరు. బెంగళూరులోని ప్రముఖ కంపెనీ ఎంటీఆర్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ అరుదైన ఫీట్‌ను సాధించింది.
లోర్మాన్ కిచన్ ఎక్విప్మెంట్స్ సహకారంతో ఏకంగా 123 అడుగుల దోశను తయారు చేసింది. 2014లో 54 అడుగుల దోశ పేరిట ఉన్న రికార్డు పదేండ్ల తర్వాత బ్రేక్ అయ్యింది.