మరో వ్యక్తి కోసం ఆస్పత్రి బెడ్ త్యాగం.. ఆగిన వృద్ధుడి ఊపిరి
పడక త్యాగం | ఓ వ్యక్తి కోసం ఆసుపత్రిలో బెడ్ త్యాగం చేసిన వృద్ధుడు ఇంటికి వెళ్లిన మూడు రోజుల్లో మరణించారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఈ ఘటన జరిగింది. ఆర్ఎస్ఎస్ సభ్యుడైన 85 ఏండ్ల నారాయణ్ దబల్కర్కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది

ముంబై: ఓ వ్యక్తి కోసం ఆసుపత్రిలో బెడ్ త్యాగం చేసిన వృద్ధుడు ఇంటికి వెళ్లిన మూడు రోజుల్లో మరణించారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఈ ఘటన జరిగింది. ఆర్ఎస్ఎస్ సభ్యుడైన 85 ఏండ్ల నారాయణ్ దబల్కర్కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయనకు ఆక్సిజన్ స్థాయిలు తగ్గడంతో ఈ నెల 22న అతి కష్టం మీద ఇందిరాగాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ లభించడంతో కుటుంబ సభ్యులు అడ్మిట్ చేశారు.
మరోవైపు ఒక మహిళ కరోనా సోకిన తన 40 ఏండ్ల భర్తను ఆసుపత్రిలో చేర్చుకోవాలని వైద్యులను ప్రాధేయపడటాన్ని నారాయణ్ చూశారు. తనకు 85 ఏండ్లని, జీవితాన్ని అనుభవించినవాడినని ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడటం ముఖ్యమని డాక్టర్లకు ఆయన చెప్పారు. ఆ దంపతుల పిల్లలు చిన్నవారని, దయచేసి తన బెడ్‌ను అతడికి ఇవ్వాలని కోరాడు. అయితే ఆయన ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నాయని, ఆసుపత్రిలో చికిత్స పొందడం అవసరమని వైద్యుడు చెప్పినప్పటికీ వినిపించుకోలేదు.
ఇంటికి వెళ్లేందుకే నారాయణ్ మొగ్గుచూపారు. తన కుమార్తెను రప్పించి పరిస్థితిని వివరించారు. చివరి రోజుల్లో ఇంట్లో అందరితో గడపాలని ఉందని అన్నారు. దీంతో నారాయణ్‌ను కుమార్తె ఇంటికి తీసుకెళ్లగా మూడు రోజుల అనంతరం మంగళవారం ఆయన కరోనాతో చనిపోయారు. దీంతో యంగ్ వ్యక్తికి ఆసుపత్రిలో బెడ్ త్యాగం చేసిన వృద్ధుడు మరణించినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
మరోవైపు ఎవరి కోసమైతే నారాయణ్ ఆసుపత్రిలో తన బెడ్‌ను త్యాగం చేశారో ఆ వ్యక్తికి దానిని కేటాయించలేదని సిబ్బంది ద్వారా తెలిసింది. ఆసుపత్రిలో బెడ్‌ను ఏ రోగికి కేటాయించాలి అన్నది వైద్యుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. అయితే ఖాళీ అయిన ఆ బెడ్‌ను అప్పటికే ఎదురుచూస్తున్న కరోనా రోగులలో అత్యవసరమైన వారిలో ఒకరికి కేటాయించినట్లు వెల్లడించారు.
ఇవికూడా చదవండి..
కరోనా అలర్ట్.. వచ్చే మూడు, నాలుగు వారాలు కీలకం
విశాఖలో విషాదం.. ప్రాణ వాయువు అందక ఆగిన చిన్నారి ఊపిరి
విజయోత్సవ ర్యాలీలపై రాష్ర్ట ఎన్నికల సంఘం నిషేధం
కొవిడ్ వార్డులోనూ పుస్తకాలతో కుస్తీ.. కానీ పరీక్షలు వాయిదా
కీలక నిర్ణయం.. ఆ దేశంలో బుర్ఖాపై నిషేధం
కూతురితో మాట్లాడుతున్నాడని కాళ్లు, చేతులు నరికేశారు..
సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ మృతి బాధాకరం : మంత్రి హరీశ్ రావు
అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్..!
నోస్టాక్ బోర్డు.. అయినా టీకా కోసం బారులుతీరిన జనం
కరోనాతో మాజీ మంత్రి కన్నుమూత
మహారాష్ర్టలో ఎన్కౌంటర్.. ఇద్దరు నక్సల్స్ హతం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
South Carolina | అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు..!
Story competition | కథల పోటీలో ప్రతిభ చాటిన పావని
Sai Pallavi | ‘రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు’.. సాయి పల్లవి వ్యాఖ్యలపై నెట్టింట దుమారం!
AP news | అర్నబ్ తుపానుతో అతలాకుతలం.. ఏపీలో నేడూ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
Osmania University | ఓయూలో పెన్‌డౌన్.. సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

