Kota Hostel | కోటా హాస్టల్లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది విద్యార్థులకు గాయాలు
Kota Hostel | పోటీ పరీక్షల శిక్షణకు కేంద్రమైన రాజస్థాన్ (Rajasthan) కోటాలోని ఓ హాస్టల్ (Kota Hostel)లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది (massive fire). ఈ ఘటనలో 8 మంది విద్యార్థులు గాయపడ్డారు.
Kota Hostel | పోటీ పరీక్షల శిక్షణకు కేంద్రమైన రాజస్థాన్ (Rajasthan) కోటాలోని ఓ హాస్టల్ (Kota Hostel)లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది (massive fire). కున్హారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ల్యాండ్‌మార్క్ సిటీ ప్రాంతంలో ఉన్న ఆదర్శ్ రెసిడెన్సీ బాయ్స్ హాస్టల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 8 మంది విద్యార్థులు గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌లో షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలు నిమిషాల్లోనే హాస్టల్లోని మూడు అంతస్తులకు వ్యాపించాయి. ప్రమాద సమయంలో హాస్టల్లోని 61 గదుల్లో సుమారుగా 75 మంది విద్యార్థులు ఉన్నారు. వారంతా ఈ ఘటనలో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు. మరికొంతమంది మొదటి, రెండో అంతస్తుల్లోని బాల్కనీ నుంచి కిందకు దూకారు. ఈ ఘటనలో మొత్తం 8 మంది విద్యార్థులు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని గదుల్లో చిక్కుకున్న కొందరు విద్యార్థులను రక్షించారు. అగ్నిమాపక యంత్రాలు సుమారు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. గాయపడిన విద్యార్థులను పోలీసులు స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కోటా సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమృత దుహాన్ తెలిపారు.
మరోవైపు ఈ ఘటనతో కోటా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. భద్రతా చర్యలను ( safety measures) పాటించకపోవడంతో సదరు హాస్టల్‌ను సీల్ వేయాలని ఆదేశించింది. అదేవిధంగా ఫైర్ సేఫ్టీ మార్గదర్శకాలను పాటించనందున కోటా – సౌత్, కోటా – నార్త్‌లోని దాదాపు 2,200 హాస్టళ్లకు ఇప్పటికే అధికారులు నోటీసులు పంపారు. ఆయా హాస్టళ్లపై త్వరలో చర్యలు తీసుకోనున్నట్లు ఓ అధికారి తెలిపారు.
Also Read..
Salman Khan | సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే..!
Madhya Pradesh | కరెంట్ కట్‌చేయడానికి వెళ్తే కర్రలతో కొట్టారు..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

