Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. 8 మంది నక్సల్స్ హతం
Encounter: చత్తీస్ఘడ్ ఎన్కౌంటర్లో 8 మంది నక్సల్స్ హతమయ్యారు. ఇవాళ ఉదయం అబుజ్మాడ్ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. నారాయణపుర్, కంకేర్, దంతేవాడ, కొండగావ్ జిల్లాలకు చెందిన భద్రతా దళాలు యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపడుతున్న సమయంలో ఎదురుకాల్పులు జరిగినట్లు రాయ్‌పూర్ సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
నారాయణపుర్: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపుర్‌లో ఇవాళ ఎన్కౌంటర్(Encounter) జరిగింది. ఆ ఎదురుకాల్పుల్లో 8 మంది నక్సలైట్లు, ఒక భద్రతా సిబ్బంది మృతిచెందారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. అబుజ్మాడ్ అడవుల్లో ఇవాళ ఉదయం ఎన్కౌంటర్ మొదలైంది. నారాయణపుర్, కంకేర్, దంతేవాడ, కొండగావ్ జిల్లాలకు చెందిన భద్రతా దళాలు యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపడుతున్న సమయంలో ఎదురుకాల్పులు జరిగినట్లు రాయ్‌పూర్ సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఇంకా అక్కడ ఫైరింగ్ నడుస్తున్నట్లు చెప్పారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, 53 బెటాలియన్ ఐటీబీపీకి చెందిన దళాలు జూన్ 12వ తేదీన కూంబింగ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. ఎన్‌కౌంటర్‌కు చెందిన మరిన్ని వివరాలు అందాల్సి ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

