Viral News | న్యూఢిల్లీ : ఇంగ్లిష్ న్యూస్ అర్థం చేసుకోవాలని, ఇంగ్లిష్‌లో దరఖాస్తు రాయాలని మిజోరంలో ఓ వృద్ధుడు(78) పాఠశాల బాటపట్టాడు. ఎండ..వాన లెక్కచేయకుండా ప్రతిరోజూ మూడు కిలోమీటర్లు నడిచి మిజోరం-మయన్మార్ సరిహద్దులో ఉన్న హైస్కూల్‌కు వెళ్తున్నాడు. ఈ ఏడాది 9వ తరగతిలో తన పేరును ఎన్రోల్ చేసుకున్న లాల్‌రింగ్‌తారా గాథ ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నది.
భారత్-మయన్మార్ సరిహద్దులోని క్వాంగ్లెంగ్ గ్రామంలో 1945లో జన్మించిన లాల్‌రింగ్‌తారా చదువు రెండో తరగతి వద్దే ఆగిపోయింది. విద్యపట్ల లాల్‌రింగ్‌తారా పట్టుదలను చూసి స్కూల్ హెడ్మాస్టర్ అభినందిస్తున్నారు.