ముంబై : షేర్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో ముంబైకు చెందిన ఒక కంపెనీ 72 ఏండ్ల వృద్ధుడిని రూ.35 కోట్ల మేర మోసం చేసిన ఘటన ముంబైలో వెలుగుచూసింది. నాలుగేండ్ల పాటు అతని ట్రేడింగ్ అకౌంట్‌ను నిర్వహించిన కంపెనీ అతడిని పెద్దయెత్తున మోసం చేసింది.
ముంబైలోని మౌతంగా వెస్ట్‌కు చెందిన భారత్ హర్కచంద్ షా, అతని భార్య గ్లోబ్ కేపిటల్ మార్కెట్ లిమిటెడ్‌లో రెండు డీ మ్యాట్ ఖాతాలు తెరిచారు. అప్పటి వరకు షా భార్యకు వారసత్వంగా వచ్చిన పెద్దమొత్తంలోని షేర్లను ఈ కొత్త ఖాతాకు బదిలీ చేశారు. తర్వాత వీరిద్దరి పేరున కంపెనీ వారే లావాదేవీలు నడిపి, అతడి షేర్లను అమ్మి, బదిలీ చేసి నాలుగేండ్లలో రూ.35 కోట్లకు ముంచేశారు.