దేశంలోని 72 నగరాల్లో అందుబాటులోకి జియో 5జీ సేవలు
Reliance JIO | దేశంలో వివిధ నగరాలకు జియో 5జీ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇవాళ మరో నాలుగు నగరాల్లో జియో 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చారు. మధ్యప్రదేశ్‌లోని
ముంబై: దేశంలో వివిధ నగరాలకు జియో 5జీ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇవాళ మరో నాలుగు నగరాల్లో జియో 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్, జబల్పూర్, పంజాబ్‌లోని లూథియానా, పశ్చిమబెంగాల్లోని సిలిగురి నగరాల్లో ఇవాళ జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో ఇప్పటివరకు దేశంలో జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన నగరాల సంఖ్య 72కు చేరింది.
ఈ విషయాన్ని ఇవాళ రిలయన్స్ జియో సంస్థ ప్రకటించింది. జియో 5జీ సేవలను దేశంలో వేగంగా విస్తరింపజేస్తున్నామని తన ప్రకటనలో జియో పేర్కొన్నది. మధ్యప్రదేశ్‌లోని అన్ని ప్రధాన నగరాల్లో జియో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చిన తొలి, ఏకైక ఆపరేటర్ రిలయన్స్ జియోనేనని తెలిపింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్, ఇండోర్ మొదలు అన్ని ప్రధాన నగరాల్లో జియో సేవలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించింది.
రిలయన్స్ జియో గత అక్టోబర్ 4న తొలిసారి ఢిల్లీ, ముంబై, వారణాసి, కోల్‌కతా నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించింది. అక్టోబర్ 22న నట్వారా, చెన్నై నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌ను లాంచ్ చేసింది. ఆ తర్వాత నవంబర్ 10న హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో 5జీ సేవలు మొదలయ్యాయి. ఆ తర్వాత రోజే గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ నగరాల్లో జియో 5జీ సేవలు షురూ అయ్యాయి.
అదేవిధంగా పుణెలో నవంబర్ 25న, గుజరాత్‌లోని 33 జిల్లాల్లో నవంబర్ 25న జియో 5జీ సేవలను లాంచ్ చేసింది. ఉజ్జయినిలో గత డిసెంబర్ 14న, కొచ్చి, గురువాయుర్‌లో డిసెంబర్ 20న 5జీ సేవలు మొదలయ్యాయి. ఇక ఏపీలోని తిరుమల, విజయవాడ, విశాకపట్నం, గుంటూరులో డిసెంబర్ 26న 5జీ సేవలు ప్రారంభమయ్యాయి.
లక్నో, త్రివేండ్రం, మైసూరు, నాసిక్, ఔరంగాబాద్, చండీగఢ్, మొహాలి, పంచకుల, జిరాక్పూర్, ఖరార్, దేరబస్సీ నగరాల్లో గత డిసెంబర్ 28న 5జీ సేవలు మొదలయ్యాయి. డిసెంబర్ 29న భోపాల్, ఇండోర్‌లో 5జీ సేవలను ప్రారంభించారు. ఇక ఈ ఏడాదిలో తొలిసారి జనవరి 5న ఒడిశాలోని భువనేశ్వర్, కటక్ నగరాల్లో రిలయన్స్ జియో 5జీ సేవలను షురూ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

