Crime news | అందమైన అమ్మాయిలంటూ వృద్ధుడికి ఎర.. రూ.4.5 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు
Crime news | అందమైన అమ్మాయితో ఏకాంతంగా గడపాలని ఆశపడిన ఓ వృద్ధుడు మోసపోయాడు. చీటర్ల బుట్టలో పడి రూ.4.5 లక్షలు పోగొట్టుకున్నాడు. చీటర్లు మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో మోసపోయినట్లు గ్రహించాడు. ఆ తర్వాత లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ముంబై: అందమైన అమ్మాయితో ఏకాంతంగా గడపాలని ఆశపడిన ఓ వృద్ధుడు మోసపోయాడు. చీటర్ల బుట్టలో పడి రూ.4.5 లక్షలు పోగొట్టుకున్నాడు. చీటర్లు మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో మోసపోయినట్లు గ్రహించాడు. ఆ తర్వాత లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని సమతానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల ఠాగూర్ కాంప్లెక్స్‌లో 71 ఏళ్ల రిటైర్డ్ అకౌంటెంట్ నివాసం ఉంటున్నాడు. అందమైన అమ్మాయిలతో ఎంజాయ్‌గా గడపాలంటే ఈ నెంబర్‌కు కాల్ చేయండి అంటూ ఈ ఏడాది మార్చి 23న ఆయన మొబైల్ ఫోన్‌కు ఒక మెసేజ్ వచ్చింది. దాంతో ఆశపడిన వృద్ధుడు ఆ నెంబర్‌కు ఫోన్ చేశాడు.
అవతలి నుంచి మాట్లాడిన చీటర్లు ఐదు అందమైన అమ్మాయిల ఫొటోలను పంపి వారిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పారు. సెలెక్షన్‌కు ముందు రూ.2,100 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. దాంతో వృద్ధుడు రూ.2,100 చెల్లించాడు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 4 వరకు పలు సందర్భాల్లో వివిధ కారణాలు చెప్పి అతని నుంచి డబ్బు డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
అలా మొత్తం రూ.4.5 లక్షలు చెల్లించిన తర్వాత కూడా మరికొంత డబ్బు పంపించాలని చీటర్లు డిమాండ్ చేశారు. దాంతో మోసపోయానని గ్రహించిన వృద్ధుడు సమతానగర్ పోలీసులను ఆశ్రయించాడు. దాంతో ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 419, సెక్షన్ 420ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

