Heatwave | ఠారెత్తిస్తున్న ఎండలు.. వడదెబ్బకు ఏడుగురు మృతి, 12 మంది పరిస్థితి విషమం
Heatwave | దేశ రాజధాని ఢిల్లీని ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటాయి. ఈ నేపథ్యంలో వేడి గాల్పులకు జనం అల్లాడిపోతున్నారు. వడదెబ్బకు ఏడుగురు మరణించారు. 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. అధిక ఎండల వల్ల ఢిల్లీ వాసులు ఆసుపత్రి పాలవుతున్నారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటాయి. ఈ నేపథ్యంలో వేడి గాల్పులకు (Heatwave) జనం అల్లాడిపోతున్నారు. వడదెబ్బకు ఏడుగురు మరణించారు. 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. అధిక ఎండల వల్ల ఢిల్లీ వాసులు ఆసుపత్రి పాలవుతున్నారు. మే 27 నుంచి సుమారు 45 మంది రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరారు. గత రెండు రోజుల్లోనే 22 మంది అడ్మిట్ కాగా వడదెబ్బ వల్ల ఏడుగురు మరణించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్ శుక్లా తెలిపారు. 12 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. కూలీలుగా పని చేసే వారే ఎక్కువగా వడదెబ్బ బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్నారని వెల్లడించారు. వడదెబ్బకు గురైన వారు చాలా ఆలస్యంగా ఆసుపత్రిలో చేరడం కూడా మరణాలు ఎక్కువగా ఉండటానికి కారణమని అన్నారు.
కాగా, ఉత్తరాదిలో మరికొన్ని రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే ఎండల వల్ల హీట్‌స్ట్రోక్ కేసులు పెరుగుతుండటంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వడదెబ్బ ప్రభావిత రోగులకు ప్రాధాన్యత ఇచ్చి చికిత్స అందించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రులకు సూచనలు జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

