ఓటింగ్‌లో భారత్ ప్రపంచ రికార్డు.. 64 కోట్ల ఓట్లు!
లోక్‌సభ ఎన్నికలలో రికార్డు స్థాయిలో భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 64.2 కోట్ల మంది ఓటింగ్‌లో పాల్గొనడం ప్రపంచ రికార్డు అని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ వెల్లడించారు.
- లోక్‌సభ పోలింగ్‌లో పాల్గొన్న 64.2 కోట్ల మంది భారతీయులు
- 68 వేల పర్యవేక్షక బృందాలు, కోటిన్నర మంది పోలింగ్ సిబ్బంది
- ఓట్ల లెక్కింపునకు ముందే ఆరోపణలకు ఆధారాలు చూపాలి
- మీడియాతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్
న్యూఢిల్లీ, జూన్ 3: లోక్‌సభ ఎన్నికలలో రికార్డు స్థాయిలో భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 64.2 కోట్ల మంది ఓటింగ్‌లో పాల్గొనడం ప్రపంచ రికార్డు అని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ వెల్లడించారు. వీరిలో 31.2 కోట్ల మంది మహిళలు ఉన్నారని తెలిపారు. ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత భారీ ప్రజాస్వామిక ప్రక్రియగా పేర్కొన్న ఈ ఎన్నికలలో 68 వేల పర్యవేక్షక బృందాలు, ఒకటిన్నర కోట్ల మంది పోలింగ్, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు.
ప్రచార సమయంలో కొందరు బడా నేతలు యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘించినప్పుడు, పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఫిర్యాదులు వచ్చినప్పుడు ఎన్నికల అధికారులు స్పందించకపోవడంపై సోషల్ మీడియాలో ‘లాపతా జెంటిల్మెన్ (అదృశ్యమైన పెద్దమనుషులు)’ పేరిట మీమ్స్ చక్కర్లు కొట్టాయి. దీనిపై రాజీవ్‌కుమార్ స్పందిస్తూ తాము ఎక్కడికీ పోలేదని, నిత్యం అందుబాటులోనే ఉన్నామని చెప్పారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నడూలేని విధంగా నాలుగు లక్షల వాహనాలు, 135 ప్రత్యేక రైళ్లు, 1,692 వైమానిక సర్వీసులను వినియోగించామని వెల్లడించారు. ఈసారి కేవలం 39 ప్రదేశాల్లో మాత్రమే రీపోలింగ్ నిర్వహించామని తెలిపారు. ఈసారి రూ.10వేల కోట్ల విలువైన మద్యం, నగదు, ఉచిత బహుమతులు, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
వదంతులు వద్దు.. ఆధారాలు చూపండి
ఎన్నికల ప్రక్రియను ఏకపక్షం చేసేందుకు కొందరు నేతలు రిటర్నింగ్ అధికారులు, జిల్లా మేజిస్ట్రేట్లను ఒత్తిడికి గురిచేశారంటూ వచ్చిన ఆరోపణలను సీఈసీ రాజీవ్‌కుమార్ తోసిపుచ్చారు. చేతనైతే తమ ఆరోపణలను బలపరిచే ఆధారాలను అందించాలని ఆయన సవాల్ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం కాకముందే.. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసిన వారి పేర్లను ప్రతిపక్ష నేతలు వెల్లడించాలని కోరారు. వదంతులను వ్యాపింపజేసి అందరిపై అనుమానం వచ్చేట్టు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియను విదేశీ శక్తులు ప్రభావితం చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కానీ, దేశంలోపలి నుంచే ఈ ఆరోపణలు వస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పలువురు జిల్లా మేజిస్ట్రేట్లకు, కలెక్టర్లకు ఫోన్లుచేసి బెదిరించారంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ చేసిన ఆరోపణలపై సీఈసీ స్పందించారు. అలా బెదిరింపులతో ప్రభావితమైన జిల్లా మేజిస్ట్రేట్ ఎవరో పేరు చెప్పాలని నిలదీశారు. దేశంలో గత 70 ఏండ్లుగా ఇటువంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయని అన్నారు. ఈ ఆరోపణలకు ఒక్క సాక్షి కూడా లేరని వ్యాఖ్యానించారు.
ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
అన్ని ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ముందుగా పోస్టల్ బ్యాలట్లను లెక్కిస్తారని, ఇందులో ఎటువంటి అనుమానం లేదని సీఈసీ స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలట్ల లెక్కింపు ప్రారంభమైన అరగంటకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలోని ఓట్లను లెక్కించడం ప్రారంభిస్తామని తెలిపారు. మెజారిటీ పోలింగ్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలట్లు అతి తక్కువగా ఉన్నాయని, అందువల్ల వాటి లెక్కింపు త్వరగా పూర్తవుతుందని చెప్పారు. చివరగా వీవీప్యాట్లలో నమోదైన ఫలితాలను ఈవీఎంలలో నమోదైన ఫలితాలతో పోల్చి చూస్తామని వివరించారు. కౌంటింగ్ ప్రక్రియ మూడు దశలుగా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పాల్గొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

