న్యూఢిల్లీ, నవంబర్ 17: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(యూజీసీ నెట్) పరీక్ష షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. ఈ పరీక్షలను డిసెంబర్ 6, 7, 8, 11, 12, 13, 14 తేదీల్లో నిర్వహిస్తారు. రెండు పేపర్లుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో(సీబీటీ) నిర్వహించే ఈ పరీక్షల్లో అబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలకు 10 రోజుల ముందు ఎగ్జాట్ సెంటర్ సమాచారాన్ని జారీ చేస్తామని, ugcnet.nta.ac.in లేదా nta.ac.in వెబ్సైట్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ పేర్కొన్నది.
అడ్మిట్ కార్డులను డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేస్తామని తెలిపింది. భారత యూనివర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అభ్యర్థుల అర్హతను నిర్ధారించేందుకు ఎన్టీఏ ఈ పరీక్ష నిర్వహిస్తుంది. ఈ ఏడాది జూలైలో జరిగిన మొదటి ఎడిషన్‌లో 83 సబ్జెక్ట్‌లకు దేశవ్యాప్తంగా 181 పట్టణాల్లో యూజీసీ నెట్ పరీక్ష నిర్వహించారు.