Padi Kaushik Reddy | ఏ పార్టీలో ఉండి మాట్లాడుతున్నవ్..? : కడియంను ప్రశ్నించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
Padi Kaushik Reddy | బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవా..? కాంగ్రెస్ పార్టీలో ఉన్నవా..? ఏ పార్టీలో ఉండి మాట్లాడుతున్నవ్..అని అడగడం తప్పా.. అని కడియం శ్రీహరిని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.
Padi Kaushik Reddy | ఎథిక్స్ నాకు లేవా లేదా నాపై పిటిషన్ వేసిన కడియం శ్రీహరికి లేవా అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ బీఆర్ఎస్ బీ- ఫామ్ మీద గెలిచిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని తిరుగుతుంటే ఏ పార్టీలో ఉన్నవ్.. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవా..? కాంగ్రెస్ పార్టీలో ఉన్నవా..? ఏ పార్టీలో ఉండి మాట్లాడుతున్నవ్..అని అడగడం తప్పా.. అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీ బీ-ఫామ్ మీద కేసీఆర్ నాయకత్వంలో గెలిచి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటికీ.. ఎస్ మా కేసీఆర్ నాయకత్వంలో ప్రజల పక్షంలో నిలబడి పోరాడుతుంది. ఉన్నవారికి ఎథిక్స్ ఉన్నట్టా..? లేదంటే అమ్ముడుపోయినోడికి ఎథిక్స్ ఉన్నట్టా..? అసలేం ఏం మాట్లాడుతున్నవ్.. అయినా దీని గురించి నేను ఎక్కువ మాట్లాడదలచుకోలేదు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ అన్ని డిస్ట్రర్బ్కావొద్దు. సెప్టెంబర్ 8వ తేదీ తర్వాత నేను స్పందిస్తా. వాళ్లే చేసిర్రు.. మేమేం చేసినం. కానీ ఇప్పుడు డైవర్ట్ అయితదని ఉద్దేశంతో నేను మాట్లాడుతలేను. బాజాప్తా పార్టీ మారని వ్యక్తిని.. బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచినం. ప్రజల పక్షాన నిలబడి కేసీఆర్ పక్షాన కొట్లాడతాం. వాళ్లలెక్క అమ్ముడుపోలేదు.. ఎథిక్స్ కమిటీనే ఆలోచన చేసుకోవాలన్నారు.
ఎథిక్స్ నాకు లేవా నాపై పిటిషన్ వేసిన కడియం శ్రీహరికి లేవా
నువ్వు ఏ పార్టీలో ఉన్నావని అడగడం తప్పా
పార్టీ కష్టకాలంలో ఉంటే ఇక్కడ పోరాడే మాకు ఎథిక్స్ ఉన్నట్లా.. లేదా అమ్ముడు పోయిన మీకు ఎథిక్స్ ఉన్నట్లా
– ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి https://t.co/omkd1NLX4C pic.twitter.com/KFFZteLXut
— Telugu Scribe (@TeluguScribe) August 31, 2026
Read Also :
Novak Djokovic: తొలి రౌండ్లోనే ఓడిన మాజీ చాంపియన్.. యూఎస్ ఓపెన్‌లో ఏడ్చిన జోకోవిచ్
Kiran Abbavaram | పిల్లితో మొదలైన మిస్టరీ.. ‘హతః’ టైటిల్ గ్లింప్స్‌తో ఆసక్తి పెంచిన కిరణ్ అబ్బవరం!
SP Mahesh B Githe | రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు.. ఎస్పీ మహేష్ బి.గితే
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

