Behead: మార్నింగ్ టీ ఆలస్యమైందని భార్య తల నరికేశాడు..
Behead: సరైన టైంకు మార్నింగ్ టీ తీసుకురాలేదని భార్య తల నరికేశాడు భర్త. టీ తయారీ ఆలస్యం అవుతుందని భార్య చెప్పడంతో .. మెడ భాగంపై తన వద్ద ఉన్న పదునైన ఆయుధంతో అటాక్ చేశాడు. ఢిల్లీ సమీపంలో ఉన్న ఘజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది.
న్యూఢిల్లీ: మార్నింగ్ టీ తీసుకురావడంతో ఆలస్యం కావడం వల్ల భార్య తలను నరికేశాడో(Behead) ఉన్మాది భర్త. ఈ ఘటన ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో జరిగింది. 50 ఏళ్ల సుందరి అనే మహిళను చంపిన కేసులో ధర్మవీర్‌ను అరెస్టు చేశారు. టీ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాత ధర్మవీర్ తన భార్యను చంపేసినట్లు పోలీసులు తేల్చారు. టీ తయారు చేసేందుకు సమయం పడుతుందని సుందరి చెప్పడంతో భర్త ఆమెతో గొడవకు దిగారు. మరో రూమ్‌లో తమ నలుగురు పిల్లలు నిద్రిస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. అరపులు వినబడడంతో సమీపంలో ఉన్న వారు ఇంటికి వచ్చారు. అప్పటికే సుందరి రక్తపు మడుగులో ఉంది. పోస్టుమార్టమ్ కోసం ఆమె శరీరాన్ని పంపారు. టీ తయారీ విషయంలో గొడవ ప్రారంభం కాగానే వెనుక నుంచి సుందరి మెడపై తన వద్ద ఉన్న పదునైన ఆయుధంతో అటాక్ చేశాడు. అటాక్ జరిగిన క్షణాల్లోనే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు ఏసీపీ ప్రకాశ్ రాయ్ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

