Food Poisoning | ప్రసాదం తిన్న 500 మందికి అస్వస్థత.. ఆసుపత్రిలో పడకల కొరతతో రోడ్డుపైనే చికిత్స
Food Poisoning | మతపరమైన కార్యక్రమంలో పంచిన ప్రసాదం తిని (eating prasad) సుమారు 500 మంది అస్వస్థతకు గురయ్యారు (Food Poisoning).
Food Poisoning | మతపరమైన కార్యక్రమంలో పంచిన ప్రసాదం తిని (eating prasad) సుమారు 500 మంది అస్వస్థతకు గురయ్యారు (Food Poisoning). ఈ ఘటన మహారాష్ట్ర (Maharashtra)లోని బుల్దానా జిల్లాలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.
లోనార్‌లోని సోమతానా గ్రామం (Somthana village)లో వారం రోజులుగా ‘హరిణం సప్తా’ అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంగళవారం చివరి రోజు కావడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ పంచిన ప్రసాదం తిని అస్వస్థతకు గురైనట్లు బుల్దానా (Buldhana) కలెక్టర్ కిరణ్ పాటిల్ (Kiran Patil) తెలిపారు. ఈ కార్యక్రమంలో 500 మందికిపైగా ప్రజలు హాజరైనట్లు చెప్పారు. ప్రసాదం తిన్న తర్వాత వారిలో చాలా మంది కడుపునొప్పి, వికారం, వాంతులతో ఇబ్బంది పడినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఆయన వివరించారు.
కాగా, అస్వస్థతకు గురైన వారందరినీ బీబీ గ్రామంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, అక్కడ పడకల కొరత ఏర్పడటంతో చాలా మంది రోగులకు ఆసుపత్రి బయట రోడ్డుపైనే వైద్యం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. చెట్లకు కట్టిన తాళ్లపై సెలైన్ బాటిళ్లను అమర్చి బాధితులకు వైద్య సేవలు అందించారు.
Also Read..
Kamal Haasan | ఇండియా కూటమిలోకి ఎమ్ఎన్ఎమ్..? కమల్ హాసన్ ఏమన్నారంటే..
Gujarat | గుజరాత్లో ఒకే తరగతి గదితో నడుస్తున్న 341 ప్రభుత్వ పాఠశాలలు..!
Ameen Sayani | దిగ్గజ రేడియో ప్రెజెంటర్ అమీన్ సయానీ కన్నుమూత
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | మరోసారి వైరల్ అవుతున్న అమితాబ్ బచ్చన్ డైట్.. ఇంతకీ ఆయన ఏం తీసుకుంటారు..?
judge’s Minor son drives Car hits scooter | లగ్జరీ కారు నడిపిన జడ్జి మైనర్ కుమారుడు.. స్కూటీని ఢీకొట్టడంతో వ్యక్తి మృతి
X Money | ఇక ఎక్స్ ద్వారా కూడా డబ్బులు పంపొచ్చు.. కొత్త ఫీచర్ ప్రకటించిన ఎలాన్ మస్క్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’లో నయనతార.. ఆరోసారి జోడీ కడుతున్న సూపర్‌స్టార్, లేడీ సూపర్‌స్టార్!
BRS Party | బీఆర్ఎస్లోకి ఖైరతాబాద్ యువ నాయకుడు జిబ్రాన్ షరీఫ్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

