Ameen Sayani | దిగ్గజ రేడియో ప్రెజెంటర్ (Iconic Radio Presenter) అమీన్ సయానీ (Ameen Sayani) కన్ను మూశారు. ప్రస్తుతం ఆయన వయసు 91. మంగళవారం రాత్రి ముంబైలోని తన నివాసంలో గుండెపోటుకు (heart attack) గురైన అమీన్‌ను.. కుటుంబ సభ్యులు హుటాహుటిన రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు రజిల్ సయానీ (Rajil Sayani) ధృవీకరించారు. సాయంత్రం 7 గంటల సమయంలో తన తండ్రి ప్రాణాలు వదిలినట్లు తెలిపారు.
కాగా, రేడియో ప్రెజెంటర్‌గా అమీన్‌కు మంచి పేరు ఉంది. 1952 నుంచి 1994 వరకు రేడియోలో సుదీర్ఘంగా సాగిన ‘బినాకా గీత్ మాల’ (Binaca Geet Mala) ఆయనకు పేరొచ్చింది. 54,000 రేడియో కార్యక్రమాలు నిర్వహించి రేడియో మాస్ట్రోగా ఆయన ప్రసిద్ధి చెందారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు సంతాపం ప్రకటిస్తున్నారు.
Also Read..
Medaram Jathara | సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం.. మేడారం జాతరపై ప్రధాని మోదీ ట్వీట్
Virat Kohli | భారత్ హాయిగా నిద్రపోతుంది.. విరుష్క జంటకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన ఆర్సీబీ
Bharat Jodo Nyay Yatra | రాహుల్ యాత్రకు ఐదు రోజులపాటు బ్రేక్