Wildfires | ఉత్తరాఖండ్ అడవుల్లో ఆరని కార్చిచ్చు.. ఐదుగురు మృతి
Wildfires | ఉత్తరాఖండ్ (Uttarakhand) అడవుల్లో (forest) చెలరేగిన కార్చిచ్చు నెలలు గడుస్తున్నా అదుపులోకి రావడం లేదు. ఈ మంటలకు నాలుగు రోజుల్లో సుమారు ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
Wildfires | ఉత్తరాఖండ్ (Uttarakhand) అడవుల్లో (forest) చెలరేగిన కార్చిచ్చు నెలలు గడుస్తున్నా అదుపులోకి రావడం లేదు. బలమైన కార్చిచ్చు కారణంగా అక్కడి అడవులు తగలబడిపోతున్నాయి. దీంతో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ రంగంలోకి దిగి హెలికాప్టర్ల ద్వారా నీటిని వెదజల్లినా మంటలు అదుపులోకి రావడం లేదు. ఇక ఈ మంటలకు నాలుగు రోజుల్లో సుమారు ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
గతేడాది నవంబర్ 1 నుంచి ఇప్పటి వరకూ ఉత్తరాఖండ్ అడవుల్లో మొత్తం 910 అగ్నిప్రమాదాలు సంభవించాయి. దాదాపు 1,145 హెక్టార్లలో అటవీ ప్రాంతం ప్రభావితమైంది. దాదాపు ఆరు నెలలుగా అక్కడి అడవులు కాలిపోతున్నాయి. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసిన మంటలు అదుపులోకి రావడం లేదు. మరోవైపు మంటల కారణంగా భారీగా ఎగసిపడుతున్న పొగ స్థానికులకు ఊపిరాడకుండా చేస్తోంది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వర్షం పడితేనే అడవుల్లో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉందని డెహ్రాడూన్‌లోని వాతావరణ కేంద్రం తాజాగా తెలిపింది. ఈ వర్షంతోనైనా అడవిలో చెలరేగిన మంటలు అదుపులోకి వస్తాయని స్థానిక అధికారులు భావిస్తున్నారు.
Also Read..
Bomb Threats | అహ్మదాబాద్‌లోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు
Amethi | అమేథిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి.. కార్లు ధ్వంసం
Brazil | బ్రెజిల్లో వర్ష బీభత్సం.. వరదల ధాటికి 78 మంది మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

