Uttarakhand Tunnel: 40 మందిని రక్షించేందుకు భారీ ఆపరేషన్.. 900ఎంఎం పైప్‌లతో టన్నెల్లో డ్రిల్
Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. శిథిలాల నుంచి 900ఎంఎం పైప్‌లను డ్రిల్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టన్నెల్‌కు అడ్డంగా ఉన్న 21 మీటర్ల శ్లాబ్‌ను తొలగించారు. ఇంకా 19 మీటర్ల మార్గాన్ని క్లియర్ చేయాల్సి ఉంది.
ఉత్తర్‌కాశీ : ఉత్తరాఖండ్ సొరంగం(Uttarakhand Tunnel)లో చిక్కుకున్న 40 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్కూ ఆపరేషన్ జోరుగా సాగుతోంది. ఉత్తర్‌కాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగంలోని కొంతభాగం ఆదివారం కూలిపోయింది. సుమారు 200 మీటర్ల మేర ఆ శిథిలాలు ఉన్నాయి. దీంతో గత 48 గంటల నుంచి కార్మికులు ఆ టన్నెల్‌లోనే చిక్కుకుపోయారు. కార్మికుల వద్దకు చేరుకునేందుకు ఎస్కేప్ మార్గాన్ని నిర్మించేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. సుమారు 40 మీటర్ల దూరంలో ఆ చిక్కుకున్న కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. టన్నెల్‌కు అడ్డంగా ఉన్న 21 మీటర్ల శ్లాబ్‌ను తొలగించారు. ఇంకా 19 మీటర్ల మార్గాన్ని క్లియర్ చేయాల్సి ఉంది.
కార్మికులకు ఆహార పానీయాలు అందించామని పోలీసులు తెలిపారు. సొరంగం లోపల ఊడిపడుతున్న పెచ్చులను ఆపడానికి కాంక్రీట్ స్ప్రే చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే 900 ఎంఎం వెడల్పు ఉన్న పైప్‌లను సొరంగంలోకి పంపేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. శిథిలాల వద్ద బోరు ద్వారా ఓ రంధ్రాన్ని వేసి, ఆ పైప్‌ల ద్వారా చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మెషీన్ ద్వారా డ్రిల్ చేసి.. ఆ రూట్లో పైప్‌లను ఆ సొరంగంలోకి చొప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ఆపరేషన్‌కు చెందిన అన్ని మెషీన్లు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ఇరిగేషన్ శాఖకు చెందిన నిపుణులు కూడా ఈ ఆపరేషన్‌లో పాలుపంచుకుంటున్నారు.
కార్మికుల్లో బీహార్, జార్ఖండ్, యూపీ, బెంగాల్, ఒడిశా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ శరణార్థలు ఉన్నట్లు తెలుస్తోంది. బ్రహ్మఖాల్, యమునోత్రి జాతీయ హైవేపై సొరంగాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిక్కుకున్న కార్మికులు బఫర్ జోన్లో ఉన్నారని, ఆహారాన్ని, ఆక్సిజన్‌ను అందిస్తున్నారని, వాళ్లు నడిచేందుకు, శ్వాస పీల్చేందుకు 400 మీటర్ల ఏరియా ఉందన్నారు. వాకీటాకీల ద్వారా మాట్లాడుతున్నట్లు రెస్క్యూ బృందాలు తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

