అక్రమ పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు.. నలుగురు దుర్మరణం
Blast in fire crackers factory: అక్రమంగా నిర్వహిస్తున్న ఓ పటాకుల తయారీ ఫ్యాక్టరిలో ప్రమాదవశాత్తు భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

లక్నో: అక్రమంగా నిర్వహిస్తున్న ఓ పటాకుల తయారీ ఫ్యాక్టరిలో ప్రమాదవశాత్తు భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లా కైరానా పట్టణంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు జరిగినప్పుడు ఫ్యాక్టరీలో 10 మంది కూలీలు పనిచేస్తున్నారని, నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, ఇంకో ఇద్దరి ఎలాంటి గాయాలు లేకుండా ప్రాణాలతో బయటపడ్డారని షామ్లీ జిల్లా కలెక్టర్ జస్జీత్ కౌర్ తెలిపారు.
మృతులు పప్పీ, సల్మాన్, ఫయీముద్దీన్, రుమాన్గా పోలీసులు గుర్తించారు. పేలుడు జరిగిన ఫ్యాక్టరీలో గతంలో పచ్చళ్లు తయారు చేసేవారని, కరోనా మహమ్మారి విజృంభణతో ఆ కంపెనీ మూతపడిందని, ఇప్పుడు అదే కంపెనీలో అక్రమంగా పటాకులు తయారు చేస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు వివరించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

